హర్ష చెముడు, దివ్యశ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సుందరం మాస్టర్. కల్యాణ్ సంతోష్ దర్శక త్వం. ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్‌కుమార్ కుర్రు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఒక గ్రామంలో ఇంగ్లీష్ బోధన కోసం వెళ్లిన ఉపాధ్యాయుడి కథ ఇది. మిర్యాలమెట్ట అనే మారుమూల గ్రామానికి ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లిన సుందరం మాస్టర్‌కు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఆద్యంతం చక్కటి వినోద్నా పంచుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దీపక్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాణ సంస్థలు: ఆర్‌టీ టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా, రచన-దర్శకత్వం: కల్యాణ్ సంతోష్.