Namaste NRI

అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్‌..భూమికి తిరిగొచ్చిన స్టార్‌లైనర్

బోయింగ్‌ చేపట్టిన తొలి అంతరిక్ష మానవసహిత ప్రయోగం అర్ధంతరంగా ముగిసింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక,  వారిని అక్కడే వదిలేసి కిందికి వచ్చేసింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెలవారుజామున 12.01 గంటలకు న్యూ మెక్సికోలోని వైట్‌ స్యాండ్స్‌ స్పేస్‌ హార్బర్‌కు ఖాళీ క్యాప్సుల్‌ భూమిని చేరింది. వ్యోమగాములు లేకుండానే ఆటోపైలట్‌ పద్ధతిలో నాసా దానిని తిరిగి భూమి మీదకు తీసుకువచ్చింది.

బోయింగ్‌ క్రూ ఫ్లైట్‌ టెస్టులో భాగంగా నాసా ఈ ఏడాది జూన్‌లో ప్రయోగం చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ జూన్‌ 5న స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరారు. వారు వెళ్లేటప్పుడే వ్యోమనౌకలో హీలియం లీక్‌ కావడంతో ప్రోపల్షన్‌ వ్యవస్థలో లోపాలు, వాల్వ్‌లో సమస్యలు వచ్చాయి. ఎలాగోలా జూన్‌ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకున్నారు. జూన్‌ 14న వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉన్నది. అయితే వ్యోమనౌకలో సాంకేతిక సమస్యను సరిచేసే క్రమంలో వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events