Namaste NRI

సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ జటాధర సెకండ్‌ పోస్టర్‌ విడుదల

సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ జటాధర. వెంకట్‌ కల్యాణ్‌ దర్శకుడు. సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. మంగళవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా సుధీర్‌బాబు చిత్ర విశేషాలు తెలియజేస్తూ శాస్త్రీయ, పౌరాణిక అంశాల కలబోతగా ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాం. ఈ రెండు భిన్న ప్రపంచాలు తెరపై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. అబ్బురపరిచే విజువల్స్‌తో ఈ సినిమాను రూపొందించబోతున్నాం అన్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని నిర్మాతలు ప్రేరణ అరోరా, శివివన్‌ నారంగ్‌, నిఖిల్‌ నంద, ఉజ్వల్‌ ఆనంద్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events