
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 8 వేల మంది అతిథులను ఆహ్వానించారు. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తన సతీమణితో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది చాలా పెద్ద విజయం. ఆయనకు నా శుభాకాంక్షలు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బలమైన ప్రతి పక్షాన్ని కూడా ఎన్నుకున్నారు. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి దారి తీస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి నాకు ఆహ్వానం అందింది. దాని గురించి త్వరలో అప్‌డేట్ ఇస్తా అంటూ వెల్లడించాడు.
