శ్రీకాంత్ గుర్రం, ప్రియాంకశర్మ జంటగా నటిస్తున్న చిత్రం తంతిరం. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించారు. సినిమా బండి పతాకంపై శ్రీకాంత్ కంద్రుగుల నిర్మించారు. సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.నిర్మాత మాట్లాడుతూ అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుందని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడుకున్న కథ ఇది. ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. కథలోని మలుపులు ఆశ్చర్యానికి గురిచేస్తాయి అన్నారు. ఈ నెల 13న విడుదల కానుంది.