ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు కోసం రూ.25 కోట్ల విరాళం అందించనుంది. అమెరికాలోని నార్త్ వెస్టర్స్ హాస్పటల్ సౌజన్యంతో తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చైర్మన్ యార్లగడ వెంకటరమణ తెలిపారు. తానా ఫౌండేషన్`నార్త్ వెస్టర్న్ మెడిసిన్ ప్రాజెక్టు ద్వారా 3.8 మిలియన్ల (సుమారు రూ.25 కోట్లు) విలువ చేసే వైద్య పరికరాలు, వైద్య యంత్రాలను అందించనున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక కార్గో షిప్‌మెంట్ ద్వారా ఈ పరికరాలు రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాలకు చేరుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం తానా కోశాధికారి కొల్లా అశోక్, తానా సమన్వయకర్త ముత్యాల పద్మశ్రీ లు ఎంతో కష్టపడ్డారన్నారు. పెద్దఎత్తున ఉన్న ఈ వైద్య పరికరాలను అనేక కంటైనర్లలో తెలుగు రాష్ట్రాలకు తరలించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు.