Namaste NRI

తెలుగు రాష్ట్రాలకు తానా 25 కోట్ల విరాళం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు కోసం రూ.25 కోట్ల విరాళం అందించనుంది. అమెరికాలోని నార్త్‌ వెస్టర్స్‌ హాస్పటల్‌ సౌజన్యంతో తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చైర్మన్‌ యార్లగడ వెంకటరమణ తెలిపారు. తానా ఫౌండేషన్‌`నార్త్‌ వెస్టర్న్‌ మెడిసిన్‌ ప్రాజెక్టు ద్వారా 3.8 మిలియన్ల (సుమారు రూ.25 కోట్లు) విలువ చేసే వైద్య పరికరాలు, వైద్య యంత్రాలను అందించనున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక కార్గో షిప్‌మెంట్‌ ద్వారా ఈ పరికరాలు రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాలకు చేరుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం తానా కోశాధికారి కొల్లా అశోక్‌, తానా సమన్వయకర్త ముత్యాల పద్మశ్రీ లు ఎంతో కష్టపడ్డారన్నారు. పెద్దఎత్తున ఉన్న ఈ వైద్య పరికరాలను అనేక కంటైనర్లలో తెలుగు రాష్ట్రాలకు తరలించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events