బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్‌పీ) అధినేత తారిఖ్ రహ్మాన్ ప్రమాణం చేశారు. దశాబ్దాల పాటు షేక్ హసీనా, ఖలేదా జియాల ఆధిపత్యంలో బంగ్లాదేశ్ రాజకీయాలు సాగగా మొదటిసారి ఎన్నికల్లో ఓ కొత్త వ్యక్తి పోటీచేసి ప్రధానిగా ప్రమాణం చేయడం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖలీదా జియా కుమారుడైన తారిఖ్ రహ్మాన్ 17 ఏండ్ల ప్రవాస జీవితాన్ని ముగించుకుని గత ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగిరావడమే గాక తన తల్లి మరణానంతరం పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఎన్నికల్లో పార్టీని విజయ తీరానికి చేర్చారు.

ఢాకాలోని జాతీయ సంగ్సద్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ జర్దారీ బీఎన్‌పీ చైర్మన్ రహ్మాన్ చేత ప్రమాణం చేయించారు. భారతదేశ ప్రతినిధిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి హాజరుకావడం హసీనా ప్రవాసంతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గే సూచనలు కనపడుతున్నాయి.















