Namaste NRI

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ సినిమా డబ్బింగ్ ప్రారంభం

తరుణ్‌భాస్కర్‌ హీరోగా ఎస్‌ ఒరిజినల్స్‌, మూవీ వెర్స్‌ సంస్థలు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఏఆర్‌ సంజీవ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తున్నది. బ్రహ్మాజీ, శివన్నారాయణ, గోప రాజు విజయ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. తాజాగా పూజ కార్యక్రమాలతో ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలు పెట్టారు. వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, తరుణ్‌భాస్కర్‌ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జయ్‌క్రిష్‌, నిర్మాతలు: సృజన్‌ యరబోలు, వివేక్‌ కృష్ణాని, సాధిక్‌, దర్శకత్వం: సంజీవ్‌ ఏ ఆర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress