తరుణ్‌భాస్కర్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతున్నది. సంజీవ్ ఏఆర్ దర్శకత్వం. తరుణ్‌భాస్కర్ సరసన ఈషారెబ్బా కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ సంస్థలు నిర్మిస్తు న్నాయి. బ్రహ్మాజీ, శివన్నారాయణ, సురభి ప్రభావతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో తరుణ్‌భాస్కర్, ఈషారెబ్బా రూరల్ గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుతున్నామని, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దీపక్, సంగీతం: జైక్రిష్, నిర్మాతలు: సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య, దర్శకత్వం: సంజీవ్ ఆర్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)