
Hounslow, Birmingham, Eastham, ilford, Coventry, Luton, Leicester , Preston నగరాల్లో ఆయా నగరాల తెలుగు యువత వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినదిస్తూ, చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అవ్వాలని,ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి బాట పట్టాలని ఆకాంక్షించారు. ఎన్నారై టీడీపీ యూకే ప్రెసిడెంట్ పోపూరి వేణు మాధవ్, వైస్ ప్రెసిడెంట్ చక్రి మొవ్వ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.


వేడుకల్లో టీడీపీ యూకే నాయకులు జైకుమార్ గుంటుపల్లి, సురేష్ కోరం, ప్రసన్న నాదెండ్ల, నరేష్ మల్లినేని,పాలడుగు శ్రీనివాస్, శ్రీకిరణ్ పరుచూరి, వాసు ఐనంపూడి, అమర్నాథ్ మన్నె , శ్రీనివాస్ లగడపాటి అలాగే ఆయా సిటీ తెలుగు యువత రవితేజ లింగ, శశాంక్ పెమ్మసాని, రవి నల్లమోతు, రాయుడి ఆదిత్య ,హరి, యుగంధర్ చింతలపూడి, గోపి భాష్యం, నరేంద్ర ములకలపల్లి, వినోద్ మాదాల పాల్గొన్నారు.



