
తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందుతోన్న సూపర్‌హీరో మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. తేజా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా న్యూ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందు లో తేజా యోధుడుగా కనిపించనున్నాడు. దానికి తగ్గట్టే పోస్టర్ కూడా డిజైన్ చేశారు. పోస్టర్‌లో మండు తున్న ఐరెన్ రాడ్‌ను పట్టుకుని పైకి చూస్తున్న తేజాను చూడొచ్చు. తేజా నేపథ్యంలో పురాతన దేవాలయం కనిపిస్తున్నది. సినిమాపై ఆసక్తిని పెంచేలా పోస్టర్ ఉందని చెప్పొచ్చు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరపై కొత్త ప్రపంచాన్ని చూపించనున్నాడని, అత్యుత్తమ సాంకేతిక విలువలతో సినిమా ఉంటుందని నిర్మాత చెబుతున్నారు. మంచు మనోజ్ ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: గౌరహరి, స్క్రీన్‌ప్లే, మాటలు, కెమెరా, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని, నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
