తేజస్ కంచర్ల నటించిన చిత్రం ఉరుకు పటేలా. గెట్ ఉరికిఫైడ్ ఉపశీర్షిక. ఖుష్బూ చౌదరి కథానాయిక. వివేక్ రెడ్డి దర్శకుడు. కంచర్ల బాలభాను నిర్మాత. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే, హీరోకి చదువులేదు. కానీ చదువుకున్న అమ్మాయిని పెళ్లాడాలనుకున్నాడు. అలాంట మ్మాయి దొరక్క, వయసు ముదురుతున్నా పెళ్లికాక బాధపడుతున్నాడు. ఇంతలో సరిగ్గా అతని ఆశలకు తగ్గ అందమైన అమ్మాయి ప్రేమించింది. ఎంతోమంది అమ్మాయిలు రిజక్ట్ చేసిన హీరోని ఈ అమ్మాయి ఎందుకు ప్రేమించిందబ్బా, అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ అమ్మాయి అసలు కోణం బయట పడింది. హీరోకి గుండె ఆగినంత పని అయ్యింది. పారిపోవాలనుకున్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఏం చేసింది? ఆమెను చూసి హీరో ఎందుకు భయపడుతున్నాడు? ఈ ప్రశ్నలన్నీ ట్రైలర్ చూస్తే ఉత్పన్నమవుతాయి. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు.