అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ టాంజానియా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. టాంజానియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఎన్నో త్యాగాలతో సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టాంజానియ కార్యవర్గ సభ్యులు శ్రీనిలై, రాజేష్, మహేష్ రెడ్డి, సురేష్, రాజు, పెర్రి, కనిష్క్, శేషు చారి గుడికందుల, ప్రణీత్ రెడ్డి, వెంకటేష్, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ టాంజానియా అడ్వైజర్స్ సంతోష్ రెడ్డి పట్లోల, సూర్య మోహన్ రెడ్డి, సురేందర్ సేలం, మధురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.














