అమెరికా వేదికగా జరిగిన మహిళల ఓపెన్ ప్రపం పవర్ లిఫ్టింగ్ (క్లాసిక్ బ్రెంచ్ ప్రెస్) ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన తెలంగాణ లిఫ్టర్ తేజావత్ సుకన్య అసాధారణ ప్రతిభతో దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసింది. 76 కిలోల విభాగంలో బరిలోకి దిగిన సుకస్య అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 మంది లిఫ్టర్లు ఈ ఛాంపియన్ షిప్‌లో పోటీ పడ్డారు. కాగా 76 కిలోల విభాగంలో సుకన్య8వ స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. అమెరికాలో అస్టిన్ నగరంలో ఈ పోటీలు జరిగాయి.