Namaste NRI

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఉగాది వేడుకలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టీఏఎల్) 21వ వార్షికోత్సవంతో పాటు ఉగాది వేడుకలు పశ్చిమ లండన్‌లోని ఎస్ కె ఎల్ పి సి, నార్త్ హాల్ట్ లో వైభవంగా నిర్వహించారు. నుంచి వందలాది తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కన్వీనర్ వాసుదేవ రెడ్డి, చైర్మన్ రవి సబ్బా ఆధ్వర్యంలో విజయవంతంగా సాగింది.

లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును లార్డ్ నాగరాజు(ఉదయ్ నాగరాజు)కి అందించారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఆయన నియామకంతో పాటు కృత్రిమ మేధస్సు రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారం ప్రదానం చేశారు. సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ప్రత్యేక సంగీత విభావరి అలరించింది. ఆయన సంగీత సేవకు గానూ కల్చరల్ ఎక్సెలెన్స్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జానపద కళాకారులు రెలరే గంగా, నల్గొండ గద్దర్ – కాసాల నర్సన్నల జానపద ప్రదర్శన ఆకట్టుకుంది. గాయకులు అఖిల్ చంద్ర, శ్రీనికా మహతి సాంప్రదాయ–ఆధునిక గీతాలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమానికి యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ట్రస్ట్ బోర్డు సభ్యులు అనిల్ అనంతుల, కిరణ్ కప్పేట, అశోక్ మడిశెట్టి, రవి మోచెర్ల, శ్రీదేవి అలెద్దుల, వెంకట్ నీల, సత్య పెడిరెడ్డి, మాజీ ఛైర్‌పర్సన్లు శ్రీధర్ మెడిచెట్టి, శ్రీధర్ సోమిశెట్టి, శ్రీధర్ వనం, భారతి కందుకూరి, సత్యేంద్ర పగడాల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, రవి వాస, లక్ష్మణ్ కోట, రాయ్ బొప్పన, శ్రీహరి అరిగె, పవన్ తిరునగరి, సునీత అరిగె, మాధవి తొటకూరు, ఉమ అనంతుల, బిందు పుట్లూరు, మురళి కోటలు సహకరించారు.

ముఖ్య అతిథిగా ఎంపీ సీమా మాల్హోత్రా టీఏఎల్ వార్షిక పత్రిక మా తెలుగు 2026 ను ఆవిష్కరించారు. పత్రిక సంపాదకుడు వంశీ మోహన్ సింగళూరిని ఈ సందర్భంగా సన్మానించారు. త్వరలో ప్రారంభం కానున్న క్రికెట్ సీజన్ టీ 20 టీఏఎల్ ప్రీమియర్ లీగ్ ( టీపీఎల్)ను కూడా ప్రకటించారు.

ఛైర్మన్ రవి సబ్బా మాట్లాడుతూ ఉగాది మన సాంస్కృతిక మూలాలనే గాక భవిష్యత్ తరాలకు ఆ పరంపరను అందించే బాధ్యతను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. కన్వీనర్ వాసు మేరెడ్డి ఈ వేడుక విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events