మంచు తుఫాన్లు టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు గల్ఫ్ కోస్ట్‌గా పేర్కొనే ప్రాంతాన్ని గజగజ వణికిస్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచు, ఎముకలు కొరికే చలి అమెరికా దక్షిణ రాష్ర్టాలను చుట్టుముట్టాయి. ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వ్యాప్తంగా 2,200కుపైగా విమాన సర్వీసులను రద్దు చేశారని, 3 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
లూసియానా, టెక్సాస్ రాష్ర్టాల్లో విమానాశ్రయాలు, జాతీయ రహదారుల్ని మూసేశారు. న్యూయార్క్ నగరంలో పలు చోట్ల 18 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. దీంతో పలు కౌంటీల్లో న్యూయార్క్ గవర్నర్ ఎమర్జెన్సీ విధించారు. న్యూ ఓర్లియాన్స్, ఫ్లోరిడా పెన్సాకోలాలో రికార్డ్‌స్థాయిలో 6.5 అంగుళాల మేర మంచు కురిసింది. కెనడాలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీలకు పడిపోయాయి.