తెలంగాణలో పీవీ శతజయంతి ఉత్సవాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిందని బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు మహేష్ బిగాల అన్నారు. ఆస్ట్రేలియాలోని ప్రవాసుల తో కలిసి సిడ్నీలోని ఓం బుష్ కమ్యూనిటీ సెంటర్ పార్క్ లో పీవీ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాల మేరకు ఆస్ట్రేలియాలో మొట్ట మొదటి విగ్రహాన్ని పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారత రత్న ఇవ్వండపై ఎన్నారైల తరపున కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమములో శాండీ రెడ్డి, కారి రెడ్డి , రాజేష్ గిరి రాపోలు, కిశోర్ బేండే, రవి దూపాటి, రాహుల్ రాంపల్లి, చిరాన్ పురంశెట్టి, రవి శంకర్ రేణుకుంట, కృష్ణ దేవతి, హేమంత్ గంగు, సునీల్, శంకర్, సీనియర్ సిటిజన్స్ నారాయణ్ రెడ్డి, నాగేశ్వర రావు, జార్జ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.