హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఓడిరచేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతికి శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢల్లీిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాకు చెందిన ఆరుగురు సర్పంచ్‌లు, ఒక ఎంపీటీసీ బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి వారికి కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం రావాలన్నారు. సెక్రటేరియట్‌కు రోజు వచ్చే సీఎం కావాలన్నారు. హుజూరాబాద్‌లో ఎలాగైన గెలిచేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తోందని, తప్పుడు హామీలు ఇస్తాందోని విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అవినీతి, నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఆ మార్పు బీజేపీతోనే సాద్యమని భావిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా దిపాయపల్లి సర్పంచ్ లావణ్య, తెల్కపల్లి సర్పంచ్ ప్రియాంక, కొనాయ పల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి, ముత్యం పేట గ్రామ సర్పంచ్ బాబోయి రాజు, లింగాయపల్లి తాండా సర్పంచ్ దేవి యాదగిరి, ఎంపీటీసీ శ్రీనివాస్ కిషన్ రెడ్డి సమయంలో బీజేపీలో చేరారు.