దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంస్థ నుంచి వస్తోన్న మరో చిత్రం జనక అయితే గనక. సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ బండ్ల దర్శకత్వం. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకోగా, ఈ చిత్ర టీజర్‌ను అగ్ర హీరో ప్రభాస్ సోషల్‌మీడియాలో విడుదల చేశారు.
మధ్యతరగతి కష్టాలను చూపిస్తూ వినోదాత్మకంగా టీజర్ సాగింది. ఆ ఒక్క నిర్ణయం నా లైఫ్‌ను మార్చేసింది అంటూ సుహాస్ చెప్పిన డైలాగ్‌తో ఆరంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నేను ఒకవేళ తండ్రి నైతే..నా భార్యను సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిట్‌లో చేర్పించాలి. నా పిల్లలను బెస్ట్ స్కూల్లో చేర్పించాలి. మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు వంటి సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: విజయ్ బుల్గానిన్, సమర్పణ: శిరీష్, రచన-దర్శకత్వం: సందీప్ బండ్ల.