Namaste NRI

ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే .. రజనీకాంత్‌

మొయిద్దీన్ భాయ్ పాత్ర‌లో సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ నటించిన చిత్రం లాల్ సలామ్. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్ దర్శకత్వంలో సుభాస్కరణ్ నిర్మించారు. ప్రజలు కుల, మత భేదాభిప్రాయం లేకుండా ఆనందంగా జీవిస్తున్న భారతదేశంలో కొందరు స్వార్థ రాజకీయాల కోసం మనలో మనకు గొడవలు పెట్టారు. ఇలాంటి చెడు పరిణామాల నుంచి ప్రజలను కాపాడిన వారెందరో ఉన్నారు. అలాంటి మహానుభావుల్లో ఒకడు మొయిద్దీన్‌ భాయ్‌. ఫిబ్రవరి 9న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో.. ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే అంటూ రజనీకాంత్‌ చెప్పే డైలాగ్‌ అద్భుతంగా ఉంది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్‌, మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: విష్ణు రంగస్వామి, సంగీతం: ఏఆర్‌.రెహమాన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events