Namaste NRI

లైలా వచ్చేది అప్పుడే

యువ హీరో విశ్వక్‌సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం లైలా. రామ్‌నారాయణ్‌ దర్శకత్వం.  ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్‌ పతాకం పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయిక. ఈ చిత్రాన్ని వాలైంటైన్‌ డేను పురస్కరించుకొని ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో విశ్వక్‌సేన్‌ ట్రెండీ లుక్స్‌తో కనిపిస్తున్నారు.

ఈ సినిమాలోకి కొన్ని ఎపిసోడ్స్‌లో విశ్వక్‌సేన్‌ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన స్పెషల్‌ మేకోవర్‌కు సిద్ధమయ్యారని, లేడీ గెటప్‌లోకి సన్నివేశాలు చక్కటి హాస్యాన్ని పండిస్తాయని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. జనవరి 1న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్‌ప్రసాద్‌, సంగీతం: లియోన్‌ జేమ్స, దర్శకత్వం: రామ్‌ నారాయణ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress