వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్‌పై రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగ రంగ వైభవంగా. కేతికాశర్మ కథానాయిక. గిరీశాయ దర్శకత్వం మహిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ఈ సినిమాని సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాయి సినీ వర్గాలు. ఈ సందర్భంగా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ మెగా హీరోలందరితోనూ సినిమాలు చేశాను. ఇప్పుడు రంగ రంగ వైభవంగా చిత్రాన్ని వైష్ణవ్ తేజ్‌తో చేశాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది అన్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 2న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. చిత్ర దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కొత్తగా కనిపిస్తారు. అలాగే కేతికా శర్మ తనదైన నటనతో మైమరపిస్తుంది అని చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)