Skip to main content

Namaste NRI

రంగ రంగ వైభవంగా వచ్చేది అప్పుడే

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రంగ రంగ వైభవంగా. కేతికాశర్మ కథానాయిక. గిరీశాయ దర్శకత్వం మహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమాని సెప్టెంబర్‌ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాయి సినీ వర్గాలు. ఈ సందర్భంగా నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ మెగా హీరోలందరితోనూ సినిమాలు చేశాను. ఇప్పుడు రంగ రంగ వైభవంగా చిత్రాన్ని వైష్ణవ్‌ తేజ్‌తో చేశాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది అన్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్‌ 2న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. చిత్ర దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌ కొత్తగా కనిపిస్తారు. అలాగే కేతికా శర్మ తనదైన నటనతో మైమరపిస్తుంది అని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events