ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది 100. ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శక త్వం. ధన్య బాలకృష్ణ, మిషా నారంగ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ధమ్మ ప్రొడక్షన్స్ పతాకాలపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జే.తారక్‌రామ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో హీరో ఆర్కేసాగర్‌ను ఐపీఎస్ అధికారి విక్రాంత్‌గా పరిచయం చేశారు. ఇది కేవలం నెంబర్ కాదు, ఒక ఆయుధం అంటూ సినిమా టైటిల్ గురించి వీడియో క్లిప్‌లో చూపించారు. ఈ సినిమా కథాంశం చాలా బాగుందని, చక్కటి సందేశంతో ఆకట్టుకుంటుందని వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఓ సోషల్ ఇష్యూని కమర్షియల్ అంశాలు మేళవించి చూపించామని దర్శకుడు తెలిపారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే చిత్రమిదని హీరో ఆర్కే సాగర్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్.
