Namaste NRI

తొలి చిత్ర హీరోతో .. వందో సినిమా

మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ తొలి సినిమా మోహన్‌లాల్‌ పూచక్కోరు మూక్కుతి(1984). 42ఏండ్లుగా దర్శక ప్రస్థానాన్ని సాగిస్తున్న ప్రియదర్శన్‌, ఎట్టకేలకు 100 సినిమాల మైలురాయికి చేరుకున్నారు. తన తొలిచిత్ర కథానాయకుడైన మోహన్‌లాల్‌తోనే తన వందవ చిత్రాన్ని కూడా చేస్తానని ముందే చెప్పారు ప్రియదర్శన్‌. ఆయన చెప్పినట్టుగానే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

స్వయంగా మోహన్‌లాలే ఈ విషయాన్ని తెలిపారు. సినిమా పట్ల ప్రియదర్శన్‌కు ఉన్న ప్రేమ వల్లే ఈ ఫీట్‌ సాధ్యమైంది. ఈ వంద సినిమాల ప్రయాణంలో నేనూ భాగం కావడం ఆనందంగా ఉంది. త్వరలో మరో మంచి కథతో కలుస్తాం అని పేర్కొన్నారు. మోహన్‌లాల్‌, ప్రియదర్శన్‌ కాంబినేషన్‌లో వచ్చిన కాలాపానీ, మిన్నరం, మరక్కార్‌ చిత్రాలు మలయాళంలో అఖండ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ప్రియదర్శన్‌ సినిమా అంటే బాలీవుడ్‌లోనూ క్రేజే. అక్షయ్‌కుమార్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన భూత్‌బంగ్లా సినిమా ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events