Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ ముందు అతిపెద్ద సవాల్‌… ఒక్కో అమెరికా పౌరుడిపై

పేద దేశాలే కాదు అగ్రరాజ్యమూ అప్పులకుప్పగా మారుతున్నది. కొత్త దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఈ అప్పులభారం అతిపెద్ద సవాల్‌గా మారనున్నది. తాజా లెక్కల ప్రకారం అమెరికా అప్పు ఏకంగా 36 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. భారత కరెన్సీలో ఇది అక్షరాలా 3,035 లక్షల కోట్ల రూపాయలు. ఈ ఏడాదే 2 ట్రిలియన్‌ డాలర్ల అప్పు పెరిగింది. ఇప్పుడు సగటున ఒక్కో అమెరికా పౌరుడిపై రూ.91 లక్షల అప్పు ఉంది.

గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అప్పులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. 2000 సంవత్సరంలో దాదాపు 5.7 ట్రిలియన్‌ డాలర్ల అప్పు ఉండగా, 2020 నాటికి 23.2 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది. కొవిడ్‌ మహమ్మారి అమెరికా ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసింది. దీంతో అప్పుల భారం అమాంతం పెరిగింది. కొవిడ్‌ మొదలైన నాటి నుంచి అమెరికా రుణాలు 16 ట్రిలియన్‌ డాలర్లు పెరిగాయి. ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల విలువ కంటే అమెరికా అప్పులే అధికం.

భారీగా పెరుగుతున్న అప్పుల ఊబి డొనాల్డ్‌ ట్రంప్‌నకు పెద్ద సవాల్‌గా మారనున్నది. రుణాలపై పెరుగుతున్న వడ్డీ భారానికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రతకు ఖర్చు పెంచాల్సిన పరిస్థితి వల్ల అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధిక పన్నులు, వడ్డీ రేట్లను తగ్గిస్తానని సైతం ట్రంప్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఈ హామీ నిలబెట్టుకోవడం మరింత కష్టమని అభిప్రాయపడుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events