పెంపుడు జంతువులంటే మొదటిగా గుర్తొచ్చేవి శునకాలు. మనుషులకు అనాధిగా అత్యంత సన్నిహితంగా ఉంటు వస్తున్నాయి శునకాలు. ఇవి ఎంతో విశ్వాసమైనవే కాదు.. ఇంటికి కాపలాగా ఉంటుంది. ఎవరైనా అపరిచితులు కనిపిస్తే గట్టిగా అరుస్తూ తమ యజమానిని అలర్ట్ చేస్తుంది. ఈమద్య కాలంలో శునకాలను తమ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. వీటికోసం ప్రత్యేకమైన వసతులను ఏర్పాటు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
అంతర్జాతీయ సెలబ్రిటీలతో సమానంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన హైడర్ (సెలబ్రిటీ కుక్క) శేరిలింగంపల్లి మదీనాగూడలోని విశ్వ పెట్ క్లినిక్‌లో సందడి చేసింది. బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ సెలబ్రిటీ డాగ్ బ్రీడర్ సతీశ్, కెడాబోమ్స్ రష్యాకు చెందిన కొకేషన్ షెపర్డ్ జాతి కుక్క (కెడాబోమ్స్ హైడర్)తో కలిసి పెట్ క్లినిక్‌ను సందర్శించారు. హైడర్‌ను రూ.20 కోట్లకు కొనుగోలు చేసినట్టు, ప్రస్తుతం సినీ తారలతో సమానంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినట్టు సతీశ్ తెలిపారు.
సినిమాల్లో ప్రత్యేక పాత్రలు, అంతర్జాతీయంగా సెలబ్రిటీగా హైడర్ కొనసాగుతుందని చెప్పారు. పలు ఫ్యాషన్ షోలలో సైతం పాల్గొనాలని ఆహ్వానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ డాగ్‌కు ప్రతి రోజు 3 కిలోల మాంసంతోపాటు ఏసీ అవసరమని వివరించారు.