బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేశారు.డుమ్ డుమారే.. దుమ్ము రేగి పోవాలిలే అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రాయగా, శ్రీచరణ్ పాకాల స్వరపరిచారు. రేవంత్, సాహితి చాగంటి ఆలపించారు. గణేష్ మాస్టర్ పాటకు కొరియోగ్రఫీని అందించారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌లపై ఈ పాటను చిత్రీకరించారు.

వారి పాత్రల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని, వారి స్నేహబంధాన్నీ ఈ పాట అద్దం పట్టిందని చెప్పొచ్చు. స్నేహానికి సరైన అర్థం చెప్పేలా సాహిత్యం సాగింది. అదితి శంకర్, దివ్యా పిైళ్లె కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ నెల 30న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి మాటలు: సత్యర్షి, తూమ్ వెంకట్, కెమెరా: హరి కె.వేదాంతం, సమర్పణ: డా.జయంతిలాల్ గడా.
