Skip to main content

Namaste NRI

భైరవం నుంచి డుమ్‌ డుమారే.. దుమ్ము రేగి పోవాలిలే

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, మనోజ్‌ మంచు, నారా రోహిత్‌ హీరోలుగా రూపొందుతోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ భైరవం. విజయ్‌ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్‌ ఆనందం వెలిబుచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేశారు.డుమ్‌ డుమారే.. దుమ్ము రేగి పోవాలిలే అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్‌ రాయగా, శ్రీచరణ్‌ పాకాల స్వరపరిచారు. రేవంత్‌, సాహితి చాగంటి ఆలపించారు. గణేష్‌ మాస్టర్‌ పాటకు కొరియోగ్రఫీని అందించారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌లపై ఈ పాటను చిత్రీకరించారు.

వారి పాత్రల ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీని, వారి స్నేహబంధాన్నీ ఈ పాట అద్దం పట్టిందని చెప్పొచ్చు. స్నేహానికి సరైన అర్థం చెప్పేలా సాహిత్యం సాగింది. అదితి శంకర్‌, దివ్యా పిైళ్లె కథానాయికలుగా నటిస్తున్నారు.  ఈ నెల 30న సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రానికి మాటలు: సత్యర్షి, తూమ్‌ వెంకట్‌, కెమెరా: హరి కె.వేదాంతం, సమర్పణ: డా.జయంతిలాల్‌ గడా.

Social Share Spread Message

Latest News