వైష్ణవ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొండపొలం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మేకర్స్ మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రదర్శించారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం చిరంజీవి సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు. క్రిష్ టేకిష్, వైష్టవ్ తేజ్ నటన గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఇక ఈ చిత్రం భవిష్యత్తులో అవార్డులు, రివార్డులు కూడా సాధిస్తుందని అన్నారు. అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ఓ అందమైన, రస్టిక్ ప్రేమ కథను చూపించారు. నేను ఎప్పుడూ కూడా క్రిష్ పనితనాన్ని ప్రేమిస్తుంటాను. విభిన్న జానర్లను ఎంచుకోవడం, సమాజంలోని సమస్యలను తీసుకోవడం, ఆర్టిస్ట్‌ల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవడం క్రిష్‌లోని ప్రత్యేకత అని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)