Namaste NRI

ఈ చిత్రం భవిష్యత్తులో అవార్డులు, రికార్డులు: మెగాస్టార్

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరో హీరోయిన్లుగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొండపొలం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మేకర్స్‌ మెగాస్టార్‌ చిరంజీవికి ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రదర్శించారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం చిరంజీవి సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు. క్రిష్‌ టేకిష్‌, వైష్టవ్‌ తేజ్‌ నటన గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఇక ఈ చిత్రం భవిష్యత్తులో అవార్డులు, రివార్డులు కూడా సాధిస్తుందని అన్నారు. అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ఓ అందమైన, రస్టిక్‌ ప్రేమ కథను చూపించారు. నేను ఎప్పుడూ కూడా క్రిష్‌ పనితనాన్ని ప్రేమిస్తుంటాను. విభిన్న జానర్లను ఎంచుకోవడం, సమాజంలోని సమస్యలను తీసుకోవడం, ఆర్టిస్ట్‌ల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవడం క్రిష్‌లోని ప్రత్యేకత అని తెలిపారు.

Social Share Spread Message

Latest News