Namaste NRI

నిశ్చితార్థం చేసుకుని, బిడ్డకు జన్మనిచ్చి… ఇన్నాళ్లకు పెళ్లి చేసుకున్న మాజీ ప్రధాని

ఎంగేజ్మెంట్ చేసుకున్న అయిదేళ్ల త‌ర్వాత న్యూజిలాండ్ మాజీ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్‌ పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం నుంచి జీవిత భాగ‌స్వామిగా ఉన్న క్లార్క్ గేఫోర్డ్‌ను ఆమె పెళ్లాడింది. వెల్లింగ్ట‌న్‌కు 325 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హాక్ బే ప్రాంతంలో ఉన్న ఓ విలాస‌వంత‌మైన తోట‌లో పెళ్లి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. 2014 నుంచి జెసిండా, గేఫోర్డ్ డేటింగ్‌లో ఉన్నారు. అయితే అయిదేళ్ల త‌ర్వాత వాళ్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2017లో న్యూజిలాండ్ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆ త‌ర్వాత 2018లో ఆమె ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చి త‌ల్లి అయ్యారు. న్యూయార్క్‌లో జ‌రిగిన యూఎన్ మీటింగ్‌కు కూడా ఆ పాప‌ను తీసుకెళ్లారు. 2023 జ‌న‌వ‌రిలో ఆమె అక‌స్మాత్తుగా ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామాను ప్ర‌క‌టించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events