Namaste NRI

నా గుండె జారిపోయిందే అంటోన్న పోకిరి

వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణం‌లో, ఆయనే హీరో‌గా నటిస్తున్న చిత్రం పోకిరి. మమత హీరోయిన్‌. వికాస్ దర్శకత్వం.  హీరో వరుణ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో నుంచి మొదటి పాట నా గుండె జారిపోయిందే విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత వరుణ్ రాజ్ మాట్లాడుతూ  ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడతాం. ఈ సినిమా హిట్ అవుతుందని మాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను పవన్ కళ్యాణ్‌గారి అభిమానిని. అలాగే చిరంజీవిగారు, మహేష్ బాబుగారంటే కూడా నాకు అంతే ఇష్టం. ఈ సినిమా టైటిల్‌లోనే దమ్ముంది. పోకిరి కి ఓనర్ మహేష్ బాబు గారే. మేమంతా అభిమానులం అంతే. అభిమానులందరూ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని అన్నారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress