Namaste NRI

మేడారం జాతరలో ఆఖరి ఘట్టం… సమ్మక్క- సారలమ్మ వన ప్రవేశం

నాలుగు రోజులపాటు విశేష పూ జలు అందుకున్న సమ్మక్క, సారలమ్మ లు శనివారం వన ప్రవేశంతో మేడారం జాతర ఘట్టం ముగిసింది. మహా జాతరలో భాగంగా గద్దెలపైకి సారలమ్మ రాకతో ప్రారంభమైన జాతర ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురాగా కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొ క్కులు చెల్లించారు. ఈ నాలుగు రోజులు భక్తులు పోటెత్తడంతో మేడారం జన జాతరను తలపించింది. ఒకవైపు భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు, మరోవైపు నిలువెత్తు బంగారం సమర్పణలు ఇలా ఎటు చూసినా మేడారం కోలాహలంగా మారింది. అయితే మేడారం జాతర చివరి ఘట్టమైన అమ్మవార్ల వన ప్రవేశం శనివారం పూజారులు ఎంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగానే సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్దకు ఆయా పూజారులు (వడ్డెలు)లు చేరుకుని ఎంతో భక్తి శ్రద్ధలు, సంప్రదాయపద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే పూజా కార్యక్రమాలు బయటకు కనిపించకుండా అరగంటపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ఆ తరువాత సంప్రదాయపద్ధతిలో మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, భారీ బందోబస్తు నడుమ పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారివారి ఆలయాలకు తీసుకెళ్లగా, కన్నెపల్లికి సారల మ్మను, చిలకలగుట్టకు, కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కలను సూర్యాస్తమయం తర్వాత రాత్రి 7.27 నిమిషాలకు వన ప్రవే శం చేయించడంతో జాతర ఘట్టం ముగిసింది. తల్లులు వన ప్రవేశం చేసే సమయంలో వరుణదేవుడు చిరుజల్లులు కురిపించడంతో భక్తులు పరవశించిపోయా రు. అయితే వన దేవతల వన ప్రవేశం ముగియటంతో భక్తులు సొంత వాహనాలు, ఆర్‌టిసి బస్సులు ద్వారా తమ ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress