Namaste NRI

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ … కీలక నిర్ణయాలు ఇవే

హైదరాబాద్‌లోని  ప్రజా భవన్ లో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశం 7.45 నిమిషాలకు ముగిసింది. సమావేశం 1.45 నిమిషాల పాటు సాగింది.

ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీని, అధికారులతో మరో కమిటీని వేయాలని నిర్ణయించారు.  రెండు దశల్లో పరిష్కారం కాని సమస్యలకు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా చర్చ సాగింది.

 ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ, పరిశ్రమలశాఖ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాలరావు, సీఎస్‌ శాంతికుమారి, మరో ఇద్దరు సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతోపాటు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గేశ్‌, సీఎస్‌ నీరబ్‌కుమార్‌, మరో ఇద్దరు సీనియర్‌ అధికారులు కార్తికేయ మిశ్రా, రవిచంద్ర పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events