Namaste NRI

మా అందరి జీవితాలను మార్చిన సినిమా:  మారుతి

దర్శకుడు మారుతి తొలి చిత్రం ఈ రోజుల్లో (2012) యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని మెప్పించింది. బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించింది. శ్రీనివాస్‌, రేష్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని గుడ్‌ సినిమా గ్రూప్‌ నిర్మించింది. ఈ చిత్రాన్ని నేడు రీరిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ  చిన్న బడ్జెట్‌తో చేసిన ఈ సినిమా మా అందరి జీవితాలను మార్చివేసింది. 12 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రాన్ని మళ్లీ బిగ్‌స్క్రీన్‌పై చూసుకోవడం ఆనందంగా ఉంది  అన్నారు. పీఆర్‌ఓగా ఉన్న తనను నిర్మాతను చేసిన చిత్రమిదని, నాడు యూత్‌లో ట్రెండ్‌సెట్‌ చేసిందని నిర్మాత ఎస్‌కేఎన్‌ తెలిపారు. 50లక్షలతో తీసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించిందని, కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని దర్శకుడు మారుతి ఆ రోజుల్లోనే నిరూపించాడని శ్రేయాస్‌ శ్రీనివాస్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events