Namaste NRI

స్పెయిన్‌ శాస్త్రవేత్తల సరికొత్త ప్రతిపాదన.. ఇక  నుంచి సేఫ్‌!

గ్రహశకలాలు భూమిని ఢీకొడితే సంభవించే విపత్తును అంచనా వేయడం కూడా కష్టమే. అరుదుగా ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఊహనే ఆందోళన కలిగిస్తుంది. అత్యంత కచ్చితత్వంతో గ్రహశకలాల గమనాన్ని గుర్తించి, భూమికి ప్రమాదాన్ని దూరం చేసేందుకు స్పెయిన్‌లోని ముర్సియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ బార్కో నొవిల్లో కొత్త ఆలోచనను ప్రతిపాదించారు. గ్రహశకలాల కక్ష్యను అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం కోసం ప్రొఫెసర్‌ నొవిల్లో బుధగ్రహంపై ఒక ప్రయోగం చేశారు. సాధారణంగా ఏదైనా వస్తువు నుంచి కాంతి కిరణాలు నేరుగా మన కళ్ల మీద పడతాయి. దీంతో ఆ వస్తువు ఎక్కడ ఉంటే, అక్కడే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎక్కడో దూరాన ఉండే గ్రహశకలాల విషయంలో ఇలా జరగదని, గురుత్వాకర్షణ విక్షేపం వల్ల గ్రహశకలాలకు తాకిన కాంతి వంపు తిరుగుతుందని నొవిల్లో చెప్తున్నారు. కాబట్టి, గ్రహశకలాల కక్ష్యను గుర్తించేటప్పుడు గురుత్వాకర్షణ విక్షేపాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, తద్వారా కచ్చితంగా వాటి కక్ష్యను గుర్తించొచ్చని ప్రతిపాదించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress