
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుప డ్డారు. చాలా అవమానకరంగా జరిగాయని విమర్శించారు. ప్రముఖ చిత్రకారుడు లియొనార్డో డావిన్సీ గీసిన లాస్ట్ సప్పర్ పెయింట్ స్ఫూర్తితో చేసిన ప్రదర్శన ఓ వర్గం విశ్వాసాలను కించపర్చేటట్లు ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించి ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. అయితే, ఒలింపిక్స్ నిర్వాహకు లు మాత్రం ఏ మతాచారాలను ఉద్దేశించి ఆ ప్రదర్శన చేయలేదని వివరణ ఇచ్చారు.
