
భారత్‌పై కెనడా మరోసారి నోరు పారేసుకుంది. ఆ దేశంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆ దేశ స్పై ఏజెన్సీ ఆరోపించింది. భారత్‌తో పాటు చైనా, రష్యా, పాకిస్థాన్ దేశాలు కూడా ఆ ప్రయత్నం చేయొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ వానెస్సా లాయిడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

త్వరలో మా దేశంలో జరగబోయే ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు పీఆర్‌సీ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగించే అవకాశం ఉందని మాకు సమాచారం ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే ఉద్దేశం, సామర్థ్యం భారత ప్రభుత్వానికి కూడా ఉందని మేం భావిస్తున్నాం. రష్యా, పాకిస్థాన్ దేశాల కూడా ఆ ప్రయత్నాలు చేయొచ్చు అని లాయిడ్ ఆరోపించారు.
