Namaste NRI

యుద్ధభూమిలో సమస్యకు పరిష్కారం దొరకదు :  మోడీ

ఏ సమస్యకు అయినా యుద్ధ రంగంలో పరిష్కారాలు దొరకవని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా ఘర్షణల నేపథ్యం, అవిరామంగా శాంతి విచ్ఛిన్నం దశలో ఆయన పోలండ్‌లో స్పందించా రు. ఇది యుద్ధాల కాలం కాదని, సామరస్యపు యుగం కావాల్సి ఉందని గతంలో వెలువరించిన సందేశాన్ని మరోసారు విన్పించారు. ఉక్రెయిన్‌లో ఆయన శుక్రవారం పర్యటించనున్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఉద్రిక్తతలు ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య పోరు సాగుతోంది. మరో వైపు మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయె ల్, గాజాస్ట్రిప్‌లో నరమేధం వంటి పలు హింసాత్మక సంఘటనలు దేనికి సంకేతం అని ప్రశ్నించారు. రగిలే వివాదాలను పరస్పర సంప్రదింపులు, సామరస్యంతో పరిష్కరించుకోవల్సి ఉంటుంది.

యుద్ధం ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదు. ఇది చివరికి సమస్యలను జటిలం చేస్తుంది. పైగా ప్రాంతీయ ఘర్షణలు విస్తరించి అంతర్జాతీయ సంఘర్షణలకు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలు చోట్ల ఘర్షణలు అందరిని కలవరపరుస్తున్నాయి. అంతా కలిసికట్టుగా ఉంటేనే కయ్యాలకు సరైన పరిష్కారం దక్కుతుందని తేల్చిచెప్పారు. ఇంతకు ముందు రష్యాలో దేశాధ్యక్షులు పుతిన్‌తో మోడీ చర్చలు జరిపారు. ఇప్పుడు ఉక్రెయిన్ పర్యటన దశలో ప్రెసిడెంట్ జెలెన్‌స్కీతో కీవ్‌లో చర్చలు ఉంటాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress