Namaste NRI

తిరగబడరసామీ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యువ న‌టుడు రాజ్‌తరుణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం తిరగబడరసామీ. ఈ సినిమా లో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా న‌టిస్తుండ‌గా, రవి కుమార్ ఈ సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా, పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టీజ‌ర్ రిలీజ్ చేయగా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర‌బృందం విడుద‌ల తేదీని అనౌన్స్ చేసింది. ఈ సినిమాను మ‌హా శివ‌రాత్రి కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 23న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనితో పాటు ఒక కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events