Namaste NRI

కన్నప్ప లో స్టార్‌ హీరోయిన్‌.. అధికారికంగా ప్రకటించిన టీమ్

మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ని పోషిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం కన్నప్ప. ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకుడు. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. ఇటీవ లే ప్రభాస్‌ ఈ సినిమా సెట్‌లో అడుగుపెట్టారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వెలువడింది. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ నటించనుంది.

కన్నప్ప సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తుందని సమాచారం. ఆమె పాత్ర తాలూకు విశేషాలను త్వరలో వెల్లడించనున్నారు. కన్నప్ప చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఈ నెల 20న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో టీజర్‌ను ఆవిష్కరించబోతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress