Namaste NRI

డోనాల్డ్ ట్రంప్‌కు అండ‌గా నిలిచిన సుప్రీంకోర్టు

అమెరికా అధ్య‌క్షుల‌కు తాము తీసుకున్న నిర్ణ‌యాల ప‌ట్ల పూర్తి ర‌క్ష‌ణ ఉంటుంద‌ని ఆ దేశ సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై న‌మోదు అయిన కేసుల్లో విచార‌ణ చేప‌ట్టిన‌ సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్య‌లు చేసింది. 2020 అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన అల్ల‌ర్ల‌కు సంబంధించిన నాలుగు కేసుల్లో కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఫలితాల‌ను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్ర‌య‌త్నించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసుల్లో సుప్రీం త‌న తీర్పును వెలువ‌రించింది.

అధ్య‌క్షుడి హోదాలో తీసుకున్న నిర్ణ‌యాల‌కు రాజ్యాంగం ప్ర‌కారం ర‌క్ష‌ణ ఉంటుంద‌ని కోర్టు పేర్కొన్న‌ది. ఈ కేసులో 6-3 తేడాతో ధ‌ర్మాస‌నం తీర్పునిచ్చింది. అధికారిక చ‌ర్య‌ల‌కు ర‌క్ష‌ణ ఉంటుందని, కానీ అన‌ధికార చ‌ర్య‌ల‌కు ఇమ్యూనిటీ ఉండ‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events