Namaste NRI

టాక్సిక్‌ సర్‌ప్రైజ్ వచ్చేసింది.. రయాగా రాక్‌స్టార్‌

యశ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న హై ఓల్టేజ్‌ ఎమోషనల్‌ కమర్షియల్‌ థ్రిల్లర్‌ టాక్సిక్‌ : ఎ ఫెయిరీటెల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌. కియారా అద్వానీ కథానాయిక. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం. ఈ చిత్రాన్ని వెంకట్‌ కె.నారాయణతో కలిసి యశ్‌ నిర్మిస్తున్నారు. హీరో యశ్‌ పుట్టినరోజు సందర్భంగా టాక్సిక్‌లో ఆయన పాత్రను పరిచయం చేస్తూ క్యారెక్టర్‌ ఇంట్రో టీజర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో యశ్‌ నటిస్తున్న రాయ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా, బోల్డ్‌గా ఉంటుందో ఈ టీజర్‌ తెలియజెప్పింది. మాస్‌ ప్రేక్షకుల్ని ఆకర్షించేలా ఈ టీజర్‌ సాగింది.

ఇక టీజర్‌ని గమనిస్తే.. ఓ శ్మశానంలో కొందరు మాఫియా వ్యక్తులు గన్స్‌తో పహారా కాస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో శవ ఖననం జరుగుతోంది. ఆ నిశ్శబ్దాన్ని చేధిస్తూ ఓ అడుగు పడింది. అదే రాయ.. అతని రాకతో ఆ శ్మశానమంతా గన్‌ ఫైరింగ్‌తో మోగిపోయింది. అప్పటిదాకా ప్రాణాలతో ఉన్నవారంతా శవాలుగా మారారు. ఆ పొగ మధ్య నుంచి రాయ రివీలయ్యాడు. ఇప్పుడు ఇందులోని మెయిన్‌ క్యారెక్టర్‌ రాయ పాత్రను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మార్చి 19న సినిమా విడుదల కానున్నది.ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్వ్రి, సంగీతం: రవి బస్రూర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events