టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, నటి రహస్య గోరక్ ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‍లోని ఓ రిసార్టులో వీరి ఎంగేజ్‍మెంట్ గ్రాండ్‍గా జరుగగా, ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు బంధువు లు, స్నేహితులు హాజరయ్యారు. రాజావారు రాణిగారు సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.ఇక తొలి సినిమా తోనే కిరణ్, రహస్య గోరక్ ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మొదట్లో స్నేహితులుగా ఉన్నా, ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆగస్టులో పెళ్లి జరుగనున్నదని సమాచారం. మరో వైపు అభిమానులు ఈ ప్రేమజంటకు అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
