Namaste NRI

స్వయంభూ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా స్వయంభూ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాగా, ఇప్పుడు ఈ చిత్రం మ్యూజికల్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలోని మొదటి పాట రా రా ధీవర ఏప్రిల్ 16న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక యోధుడి స్ఫూర్తిని చాటిచెప్పే విధంగా సాగే ఈ గీతం ప్రేక్షకులను ఆకట్టుకోనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వేసవిలో స్వయంభూ వెండితెరపై భారీ స్థాయిలో సందడి చేయనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events