కల్యాణ్‌రామ్ నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఎన్‌ఆర్‌కే 21 (వర్కింగ్ టైటిల్). ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. సీనియర్ నటి విజయశాంతి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో హీరో కల్యాణ్‌రామ్‌పై దర్శకుడు సునీల్ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుంటే ఈ సినిమాలో సోహైల్‌ఖాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బ్లాక్ అండ్ బ్లాక్‌లో గ్లాసెస్ ధరించి, ైస్టెలిష్ అవతార్‌లో సోహైల్‌ఖాన్ కనిపిస్తున్నారు. ఈవిల్డోర్‌గా ఇందులో ఆయన పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు చెబుతున్నారు. శ్రీకాంత్, సాయి మంజ్రేకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథనం: శ్రీకాంత్ విస్సా, కెమెరా: రామ్‌ప్రసాద్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, సమర్పణ: ముప్పా వెంకయ్యచౌదరి, నిర్మాణం: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.