అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. హ్యుస్టన్ మార్కెట్‌లో ఓ దుండగుగు కాల్పుల జరపడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బహిరంగ మార్కెట్‌లో కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. అయితే రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణమే కాల్పులకు దారి తీసిందని పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారిద్దరి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాల్పులు జరిపినవారు, గాయపడ్డవారు అందరూ 20 ఏండ్లలోపు వారని పోలీసులు తెలిపారు.














