Skip to main content

Namaste NRI

అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. హ్యుస్టన్‌ మార్కెట్‌లో ఓ దుండగుగు కాల్పుల జరపడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బహిరంగ మార్కెట్‌లో కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. అయితే రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణమే కాల్పులకు దారి తీసిందని పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు  అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారిద్దరి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాల్పులు జరిపినవారు, గాయపడ్డవారు అందరూ 20 ఏండ్లలోపు వారని పోలీసులు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events